'వాడరేవు, రామాపురం బీచ్ లను తెరవలేదు'

73చూసినవారు
'వాడరేవు, రామాపురం బీచ్ లను తెరవలేదు'
వరుస ప్రమాదాల నేపథ్యంలో మూతబడిన వాడరేవు, రామాపురం బీచ్ లను బుధవారం తెరిచినట్లు వచ్చిన వార్తలను చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ ఖండించారు. బుధవారం బాపట్ల వద్ద ఉన్న సూర్యలంక బీచ్ ను మాత్రమే తెరిచారని, వాడరేవు, రామాపురం బీచ్ లలో మరికొన్ని భద్రతాపరమైన చర్యలను చేపట్టాల్సి ఉన్నందున వీటిని మూసే ఉంచామన్నారు. పర్యాటకులు ఈ విషయం గమనించి చీరాల నియోజకవర్గంలోని బీచ్ లకు రావద్దని సీఐ సత్యనారాయణ కోరారు.

సంబంధిత పోస్ట్