వేటపాలెం: విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి

58చూసినవారు
వేటపాలెం: విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి
విద్యుత్ ఘాతానికి గురై ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన మంగళవారం అనుమల్లి పేటలో జరిగింది. వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ వైరు తెగి కింద పడడంతో దాన్ని పక్కకు తీసే క్రమంలో బొడ్డు మోహన్ రావు అనే వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వేటపాలెం ఎస్. ఐ వెంకటేశ్వర్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని బుధవారం ఆయన సందర్శించారు.

సంబంధిత పోస్ట్