వేటపాలెం: ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారులు

50చూసినవారు
వేటపాలెం: ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారులు
వేటపాలెం మండలంలో విద్యుత్ శాఖాధికారుల పనితీరు విమర్శలకు తావిస్తోంది. ప్రమాదాలు జరిగేలా విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నప్పటికీ, సర్వీస్ వైర్లు తెగిపోయి కనిపిస్తున్నప్పటికీ విద్యుత్ అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఫిర్యాదులు చేసినప్పటికీ వారు స్పందించడం లేదని చెప్పారు. గతంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక ఇంటిలో అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్