కోడిపందాల నిరోధక చర్యల్లో భాగంగా వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు శనివారం మండలంలోని కటారివారిపాలెంలో దాడులు నిర్వహించిన క్రమంలో పందెం కోళ్లకు కత్తులు కట్టే ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 20 కోడి కత్తులను, వెయ్యి రూపాయల నగదును స్వాధీనపరచుకున్నట్లు ఆయన తెలిపారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మండలంలో ఎవరూ ఎలాంటి జూద కార్యకలాపాలు నిర్వహించరాదని, నిరంతరం దాడులు చేస్తామని ఎస్. ఐ హెచ్చరించారు.