వేటపాలెం ఆర్టీసీ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వ్యక్తి శుక్రవారం నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మంకెనవారిపల్లికి చెందిన పిచ్చుక మల్లికార్జున (45) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆపై నిప్పంటించుకుని బిగ్గరగా కేకలు వేయడం చూసిన స్థానికులు సమాచారం అందించగా 108 సిబ్బంది అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.