వేటపాలెం: అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే

69చూసినవారు
వేటపాలెం: అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే
వేటపాలెం మండలం దేశాయిపేట సచివాలయం నందు ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి ఆయన చర్చించారు. దేశాయిపేట పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి తనకు నివేదికను అందజేయాలని ఎమ్మెల్యే కొండయ్య అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్