చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్సై శ్రీహరి ఆదివారం వేటపాలెం మండలంలో విస్తృతంగా దాడులు జరిపిన క్రమంలో చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకు వద్ద ప్రభుత్వ అనుమతికి మించి అధికంగా మద్యం సీసాలు కలిగిన ఒక వ్యక్తి దొరికాడు. అతడి వద్ద నుండి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు. బెల్ట్ దుకాణాలను ఏరిపారేస్తామన్నారు.