వేటపాలెం: వివాహిత ప్రాణాలు నిలిపిన ఎస్సై జనార్ధన్

14చూసినవారు
వేటపాలెం: వివాహిత ప్రాణాలు నిలిపిన ఎస్సై జనార్ధన్
కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన వివాహితను వేటపాలెం ఎస్సై జనార్ధన్ శనివారం రక్షించి ఆమె ప్రాణాలు నిలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చల్లారెడ్డి పాలెం కు చెందిన పొట్లూరి నందిని ఆత్మహత్యకు సిద్ధపడి కాలువ వైపు వెళ్ళింది. ఈ సమాచారం అందుకున్న ఎస్సై జనార్థన్ సకాలంలో అక్కడికి చేరుకొని ఆమెను నిలవరించారు. తన భర్త వేధింపుల గురించి ఆమె చెప్పగా ఎస్ఐ అతడి పై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి నందినిని ఇంటికి పంపారు.

సంబంధిత పోస్ట్