వేటపాలెం పంచాయతీ సెక్రెటరీ మోహన్ రంగారావుకు గురువారం పంచాయతీ కార్మికుల తరఫున సిఐటియు నాయకులు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలను పంచాయతీ కార్మికులకు కూడా చెల్లించాలని అన్నారు. వారికి కనీసం 21 వేలు జీతం అందించాలని సిఐటియు నాయకులు కోరారు.