వేటపాలెం: ఇద్దరు వ్యవసాయ మోటార్ల చోరుల అరెస్ట్

10చూసినవారు
వేటపాలెం: ఇద్దరు వ్యవసాయ మోటార్ల చోరుల అరెస్ట్
వేటపాలెం మండలంలో వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్న షేక్ నాజర్ వలి, షేక్ సుభాని అనే ఇద్దరు దొంగలను శనివారం ఎస్సై జనార్ధన్ అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లక్షా పదివేల రూపాయలు విలువ చేసే ఐదు మోటార్లను స్వాధీనపరుచుకున్నారు. ముద్దాయిలు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాల బాట పట్టారని ఎస్సై చెప్పారు. నిందితులను చీరాల కోర్టులో హాజరు పరచగా వారికి మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్