వేటపాలెం మండలంలోని రామన్నపేట పంచాయతీ పరిధి బాపయ్యనగర్‌లో డొక్కా శ్రావణి అనే మహిళ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై జనార్దన్ అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.