రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో తన ఆట, పాట, డప్పు దరువులతో.. ప్రజలను చైతన్య పరిచిన కామ్రేడ్ ఉన్నం నాగేశ్వరరావు సంస్కరణ సభను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. తన కుటుంబాన్ని సైతం ప్రజా ఉద్యమాలకు ప్రభావితం చేసి ఆఖరి వరకు ప్రజల కోసం పనిచేసిన అమరుడు నాగేశ్వరరావు సంస్మరణ సభ ఈనెల 6 న సత్తెనపల్లి వడ్డవల్లిలో జరుగుతుందని తెలియజేశారు.