వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నూతలపాటి అశోక్ " కంటి రెటీనా సంబంధిత వ్యాధుల" పై చేసిన పరిశోధనలకు గాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందినట్లు కళాశాల ఛైర్మన్ శవాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. వివిఐటి కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నూతలపాటి అశోక్ "రెటినల్ వ్యాధుల గుర్తింపు మరియు వర్గీకరణ సంబంధిత నమూనాలపై" చేసిన పరిశోధనా పత్రాలను ప్రొఫెసర్ డా.కె.గంగాధర రావు పర్యవేక్షణలో అందించడం ద్వారా ఈ డాక్టరేట్ పొందినట్లుగా తెలిపారు. అనంతరం నూతలపాటి అశోక్ ను ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, ప్రిన్సిపల్ డా.వై. మల్లికార్జున రెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ డా. కె. గిరిబాబు, ఐటి విభాగాధిపతి డా.ఆళ్ల కళావతి అభినందించారు.