మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న పనులపై ఈనెల 23 నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు బుధవారం పీడీ జోసఫ్ కుమార్ తెలిపారు. నరసరావుపేట లోని అయన కార్యాలయంలో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం వేతనాలు కోరేవారికి వారి హక్కులు, అర్హతపై గ్రామ సభలో అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రస్తుతం మంజూరు చేయబడిన పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఈ సభలలో చదివి వినిపించాలని తెలిపారు.