రాష్ట్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ. 2, 047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్ కు సంబంధించిన డీపీఆర్ కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి (డీఆర్ఎం) రామకృష్ణ తెలిపారు. గురువారం గుంటూరు రైల్విహార్ క్రీడామైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈమార్గంలో కృష్ణానదిపై ఒకభారీ వంతెన కూడా నిర్మిస్తున్నామన్నారు.