1,450 ఎకరాల్లో వసతులకు రూ1,052 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ శుక్రవారం వివరించారు. రాష్ట్రంలో గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపై నిపుణులతో చర్చించినట్లు ఆయన ప్రకటించారు. యూపీ పర్యటనలో ఘన వ్యర్థాల నిర్వహణపై పలు అంశాలన పరిశీలించినట్లు తెలిపారు. ఏపీకి వచ్చి మన ప్లాంట్లు స్టడీ చేస్తామని యూపీ అధికారులు చెప్పినట్లు మంత్రి నారాయణ వివరించారు.