కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేడు (జూన్ 15) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో కలిసి లంచ్ సమావేశంలో పాల్గొంటారు. ఇందులో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం గుంటూరులోని పొగాకు బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించి, పొగాకు రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.