జేఎన్టీయూ గురువారం ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల చేసింది. గుంటూరు జిల్లాలో 1, 733 మంది హాజరయ్యారు, అందులో 1, 633 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 92. 78%, బాలికలు 96. 63% ఉత్తీర్ణతతో మొత్తం జిల్లా ఉత్తీర్ణత శాతం 94. 23%గా ఉంది. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులను అభినందించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఉన్నత విద్యలో సుస్థిర భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు.