గుంటూరు నగరంలోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు ఎమ్మెల్యే నసీర్ సుమారు రూ. 8 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.