వైసీపీ నేత అపార్టుమెంట్ పరిశీలించిన కమిషనర్

60చూసినవారు
వైసీపీ నేత అపార్టుమెంట్ పరిశీలించిన కమిషనర్
గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ ను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. అపార్టుమెంట్ ప్లాన్ కు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలతో కమిషనర్ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్ వైసీపీ నేత అంబటి మురళికి చెందినదిగా గుర్తించారు. ఇప్పటికే ఈ అపార్ట్మెంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని పొన్నూరు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించగా, పలువురు కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్