పాఠశాల స్థాయి నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రగతి నగర్ లో నెల రోజులుగా నిర్వహిస్తున్న కంప్యూటర్ ఉచిత శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేని, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి పాల్గొన్నారు.