గుంటూరు పట్టణంలోని కొత్తపేట పరిధిలో ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, కొత్తపేట సీఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలను సైబర్ మోసాల గురించి హెచ్చరిస్తూ, గుర్తించాల్సిన సూచనలు, ముందు జాగ్రత్తలు వివరించారు. సోషల్ మీడియా, ఆన్ లైన్ లింకుల వలన మోసపోవద్దని తెలిపారు.