గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు అది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడిని గుర్తు తెలియని వ్యక్తిగా నిర్ధారించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 86888 31320 లేదా 0863-2221815 నంబర్లకు సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.