గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు జరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులను ఆదివారం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. వాహనాల రాకపోకల రద్దీ ఉండే రహదారులు ప్రధాన కూడళ్లు ట్రాఫిక్ మళ్లింపు వద్ద తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించి సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రణాళిక బద్ధంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలన్నారు.