చౌక డిపోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే నసీర్

66చూసినవారు
చౌక డిపోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే నసీర్
గుంటూరు నగరం అరండల్ పేటలోని ఓ కళ్యాణ మండపంలో ఆదివారం గుంటూరు జిల్లా జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణ దారుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ చౌక డిపోల ద్వారా రూ. 2లకే కిలో బియ్యం ఇచ్చి ప్రతి పేదవానికి పొట్ట నింపే కార్యక్రమాన్ని నందమూరి తారకరామారావు నిర్వహించారని గుర్తు చేశారు. చౌక డిపోల వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్