గుంటూరు కోర్టులో పోసాని కృష్ణ మురళి తరఫున వాదనలు బుధవారం ముగిశాయి. జడ్జి సమక్షంలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న ఆయన, "తప్పు చేస్తే నన్ను శిక్షించండి" అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పటికే రెండు ఆపరేషన్లు, స్టంట్లు వేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే జీవితంపై ఆశ వదిలేస్తానని కోర్టులో వాపోయారు.