గుంటూరు మిర్చియార్డు వద్ద రైతుల ఆందోళన

82చూసినవారు
గుంటూరు మిర్చియార్డు వద్ద రైతుల ఆందోళన
గుంటూరులోని మిర్చియార్డు ఎదుట బుధవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. మిర్చికి గిట్టుబాటు ధరలు లేవని, రైతులు తీవ్ర నష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని మద్దతు ధరను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్