ఫిరంగిపురం: నూతన సీఐగా శివరామకృష్ణ బాధ్యతలు

64చూసినవారు
ఫిరంగిపురం: నూతన సీఐగా శివరామకృష్ణ బాధ్యతలు
ఫిరంగిపురం నూతన సీఐగా కె. శివరామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఐడీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిరంగిపురం సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిరంగిపురం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి, అక్రమ బెల్ట్ షాపులు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్