దాబా పైనుంచి పడి యువతి మృతి చెందిన ఘటన ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. సీఐ శివరామకృష్ణ వివరాలు ప్రకారం రసూల్ పేటకు చెందిన చిన్న బత్తిని జ్యోత్స్న వేళాంగిణి మేరీ ఈనెల 13వ తేదీ రాత్రి తన తల్లి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ, డాబా పిట్టగోడపై కూర్చోగా ప్రమాదవశాత్తు కింద పడింది. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది.