బీజేపీ గుంటూరు రూరల్ ఉత్తర మండల సమావేశం గురువారం గోరంట్లలోని అన్నపూర్ణ నగర్ లో నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతరావు మాట్లాడుతూ మండలంలో పార్టీని బూత్ స్థాయిలో పటిష్ట పరచాలని, ప్రధాని నరేంద్ర మోడీ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని కోరారు. పార్టీ పట్టిష్ట కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వై. వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.