ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడిపై ట్విట్టర్‌లో అసభ్యకరమైన పోస్టులు చేసిన కర్నూల్ జిల్లా గూడూరుకు చెందిన పుట్టపాశం రఘు అలియాస్ పుష్పరాజ్‌ను ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. వాస్తవంగా మెగా ఫ్యామిలీపై ద్వేషంతో పాటు అల్లు అర్జున్‌కు మద్దతుగా పుష్పరాజ్ నకిలీ ఖాతాల ద్వారా బూతులు, దూషణలతో పోస్టులు పెడుతున్నట్టు గుర్తించామన్నారు.