గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 163వ వార్షిక ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దశ సహస్ర కలశాభిషేకం ఘనంగా జరగగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు నరసింహారావు, లక్ష్మి గురు ప్రసాద్, శ్రీనివాస్, సత్య, సురేష్ తదితరులు హాజరయ్యారు.