సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు సత్వరమే స్పందించి జీఎంసీ అధికారులకు చెత్త తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించిన జీఎంసీ సిబ్బంది వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా వారు శనివారం మాట్లాడుతూ బహిరంగ ప్రదేశంలో చెత్త వేయవద్దని స్థానికులకు సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.