గుంటూరు: పోలీస్ స్టేషన్ సమీపంలోనే అసాంఘిక కార్యకలాపాలు!

62చూసినవారు
పాతగుంటూరు పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఉన్నా ప్రభుత్వ భవనాల్లో అసాంఘిక కార్యకలాపాలు ఆగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం, వినాయక గుడి పక్కన ఉన్న అసంపూర్తి ప్రభుత్వ భవనాల్లో ఆకతాయిలు అర్థరాత్రి వరకూ మద్యం సేవిస్తున్నారని చెబుతున్నారు. పోలీస్ పెట్రోలింగ్‌ లేకపోవడంతో వారికి అడ్డు లేకుండా పోతోందంటున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్