పాత గుంటూరు బుచ్చయ్య తోట రెండవ లైన్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను ఆదివారం పాత గుంటూరు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆటోలో అక్రమంగా రేషన్ తరలిస్తున్నారు అన్న సమాచారం మేరకు తనిఖీ చేసిన అధికారులు 60 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆటోను స్టేషన్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు అన్నారు.