ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తమ III/IV బీటెక్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 2024లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 833 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 683 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.