గుంటూరు: జీఎస్టీ అప్పీల్స్ కమిషనర్ కు ఉత్తమ సేవా పురస్కారం

జీఎస్టీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గుంటూరులోని పట్నంబజూరుకు చెందిన కస్టమ్స్ జీఎస్టీ అప్పీల్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఉత్తమ సేవల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పురస్కారాన్ని సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. విధి నిర్వహణతోపాటు సామాజిక సేవలో భాగస్వామ్యం కావడమే దీనికి కారణం.