గుంటూరు: మరో కేసులో బోరగడ్డ అనిల్ కు రిమాండ్

78చూసినవారు
గుంటూరు: మరో కేసులో బోరగడ్డ అనిల్ కు రిమాండ్
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ పై మచిలీపట్నం చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై దూషణ కేసులో అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనపై గతంలో చిలకలపూడి పీఎస్ లో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనను గురువారం మచిలీపట్నం తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్