వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఉపసంహరించాలంటూ గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం దశల వారీ పోరాటాలకు పిలుపునిచ్చింది. మంగళవారం మల్లయ్యలింగంభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ముస్లిం, క్రైస్తవ, హిందూ సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలు పాల్గొన్నాయి. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వక్ఫ్ చట్టాన్ని సవరించిందని, ఇది భవిష్యత్‌లో అన్ని మతాల ఆస్తులకు ముప్పుగా మారుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్ పేర్కొన్నారు.