రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భవన నిర్మాణ అనుమతుల నిబంధనలపై అనవసర అపోహలు ఉన్నాయని, ప్రజలు వాటిని వీడాలని టౌన్ ప్లానింగ్ గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ సూచించారు. తెనాలి టౌన్ ప్లానింగ్ విభాగాన్ని తనిఖీ చేసిన ఆయన, కొన్ని లైసెన్స్ సర్వేయర్లు అపోహలు సృష్టించడంతో ప్లాన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పట్టణాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.