గుంటూరు జిల్లా పొన్నెకల్లు పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రవీణ్ అనే యువకుడి మెకానిక్ షెడ్డును సందర్శించారు. అనంతరం అతడి ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బైక్ మెకానిక్‌ల సమస్యలను ప్రవీణ్ ద్వారా తెలుసుకున్న సీఎం.. అతడికి మంచి శిక్షణ ఇచ్చి, గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సహాయంతో పాటు, ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.