అన్నా క్యాంటీన్‌కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నందున తగిన విధంగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అక్షయ పాత్ర సిబ్బందిని నియమించారు. గురువారం అమరావతి రోడ్డులోని అన్నా క్యాంటీన్‌ను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. అక్కడ టిఫిన్ చేసి, ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి నాణ్యత, ఇతర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.