గుంటూరు లోని శుద్ధపల్లిడొంకకు చెందిన రాజేశ్ కుమార్ సోమవారం ఎస్పీ కార్యాలయంలో జీజీహెచ్ ఎంఎన్వో పై ఫిర్యాదు చేశాడు. తన తల్లి లలితకుమారిని జీజీహెచ్‌లో పర్మినెంట్ ఆయాగా నియమిస్తానని చెప్పి అతను రూ.8 లక్షలు, 15 సవర్ల బంగారం తీసుకున్నాడని ఆరోపించాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాడు.