గుంటూరు: ఉద్యోగ భద్రత సర్కులర్ తక్షణమే అమలు చేయాలంటూ ధర్నా

10చూసినవారు
గుంటూరులో ధర్నాలో భాగంగా ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ శనివారం నాడు నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పులిశెట్టి దామోదర్ రావు మాట్లాడుతూ. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ భద్రత సర్క్యులర్ తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మొద్దు నిద్ర మాని తమ డిమాండ్లపై దృష్టి పెట్టాలని కోరారు. లేకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేయటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.