గుంటూరు జిల్లా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో బ్రాడిపేట శాంతినికేతన్ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది.ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు.ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక పిల్లల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.