ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ శనివారం ప్రకటించింది. ఈ నెల 21న రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పరీక్ష తేదీలను మార్చినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు డీఎస్సీ వెబ్ సైట్లో ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.