జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం మే 20వ తేదీన జరుగు సార్వత్రిక సమ్మెలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అన్నారు. బుధవారం ఫిరంగిపురం మండలంలోని గుండాలపాడు, బేతపూడి గ్రామాలలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.