జాతీయ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించే సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ గురువారం పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం జీఓ నెం. 17 ద్వారా సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం హామీలిచ్చినా ఇప్పటివరకు బోర్డు పునరుద్ధరణ జరగకపోవడం దురదృష్టకరమన్నారు. బోర్డు చైర్మన్ నియామకాన్ని స్వాగతిస్తున్నామని, అయితే హామీల అమలుకే కృషి చేయాల అన్నారు.