యోగాంధ్ర-2025 క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం మంగళగిరి ఎకో పార్కులో జరిగిన యోగాంధ్ర కార్య క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మే 21 నుంచి జూన్ 21 వరకు జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అనంతరం యోగా ట్రైనర్లు ఆసనాలు వేయించగా, చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.