గుంటూరు: అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే నసీర్

57చూసినవారు
గుంటూరులో పలు ప్రాంతాలలో పామ్ సండే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ ఆదివారం పలు చర్చిల్లో జరిగిన పామ్ సండే ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పామ్ సండే విశిష్టతను ప్రజలకు తెలియజేయడానికి ర్యాలీలు నిర్వహించడం శుభపరిణామని కొనియాడారు. అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తక్షణమే తన వద్దకు తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్